Thu Dec 19 2024 18:08:18 GMT+0000 (Coordinated Universal Time)
మూడు నెలలు జీతాల్లేవ్.. స్పైస్ జెట్ కీలక నిర్ణయం
విమానయాన సంస్థ స్పైస్ జెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది
విమానయాన సంస్థ స్పైస్ జెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది. స్పైస్ జెట్ ఆర్థిక సంక్షోభంలో ఉండటంతో దాని నుంచి బయట పడేందుకు సిబ్బందికి మూడు నెలల జీతాలను ఇవ్వకూడదని నిర్ణయించడం సిబ్బందిలో ఆందోళనకు కారణమయింది.
ఆర్థిక సంక్షోభం కారణంగా
ఆర్థిక సంక్షోభం కారణంగా 150 మంది క్యాబిన్ సిబ్బందిని తాత్కాలికంగా మూడు నెలల పాటు వేతనాలు చెల్లించకుండా ఉండాలని స్పైస్ జెట్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సంస్థ దీర్ఘకాలికంగా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆఫ్ సీజన్ కావడం, ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో స్పైస్ జెట్ ఈ నిర్ణయం తీసుకుంది.
Next Story